. . . ఇద్దరు యువకులకు గాయాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

నిజామాబాద్ నగరంలో జరుగుతున్న 43 వ ఇండస్ట్రీయల్ అండ్ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ( నుమాయిష్) ప్రజల ప్రాణాలకు మీదకు వస్తుంది. అక్కడ ఏర్పాట్లలో జరిగిన పోరపాట్లు ప్రమాదానికి కారణం అవుతున్నాయి. ఆదివారం నగరంలో కంటేశ్వర్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ప్రమాదవాశాత్తు క్రేజీ విల్ ట్రాలీ రన్నింగ్ లో విరిగి పడింది. అందులో కూర్చున్న ఇద్దరు యువకులు ఇరవై అడుగుల పై నుంచి వేగంగా కిందపడ్డారు. అందులో ఇద్దరికి గాయాలు అయ్యాయి. ఓకరు ట్రాలీలో ఇరుక్కుని తీవ్రంగా గాయపడి నరకయాతన అనుభవించారు.

ఆదివారం కావడంతో సందర్శకుల సంఖ్య ఎక్కువగా పెరిగింది క్రేజీ వీల్ పై సరదా కోసం కొందరు ఎక్కారు . అ సమయంలో క్రేజి విల్ పై దాదాపు 20 జంటలు ఉన్నాయి. ఈ ఘటన జరుగానే బాధితులు నిర్వాహకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గత వారం దొంకేశ్వర్ మండలం నూత్ పల్లికి చెందిన జెయింట్ వీల్ పై ఎక్కి గుండెపోటుతో మరణించింది. అంతలోనే ఈ సంఘటన జరిగింది. అయినప్పటికి ఎగ్జిబిషన్ వద్ద ఎలాంటి అత్యవసర వైద్య సేవలు ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. నుమాయిష్ పేరిట ప్రతి ఏటా లక్షల రూపాయలు ఆదాయం ఉన్న కనీస వసతులు ఏర్పాటు చేయలేక ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా అధికారులు ఎగ్జీబిషన్ కమిటీలో ఉన్న అందులో కనీస ప్రామాణిక జాగ్రత్తలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.