కుప్పకూలిన విమానం
. . . ఇద్దరు దుర్మరణం వెబ్ డెస్క్, బతుకమ్మ : అమెరికాలోని శాన్ డియేగోలోని మాంట్ గోమెరీ - గిబ్స్ ఎగ్జిక్యూటివ్ విమానాశ్రయంలో విమానం కుప్పకూలింది. సెస్నా స్కైహాక్ విమానం నేలను తాకగానే భారీగా మంటలు చెలరేగాయి.ఆ మంటల్లోనే ఇద్దరు సజీవ దహనం అయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు విచారణ చేస్తున్నారు.