అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపండి

ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అక్రమార్కులపై  చర్యలు అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని సూచన సీఎం రేవంత్ రెడ్డి వెబ్ న్యూస్, బతుకమ్మ : అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని సంబంధిత శాఖ అధికారులకు  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇసుక రీచ్ లను తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా అక్రమార్కులపై  చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.