Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 6:04 pm Posted by : ramakrishna

సీపీఎస్ రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు చేయాలి

 

. . . జిల్లా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం భాస్కర్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఉద్యోగుల పి.ఆర్.సిని వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు పరచి ఓ పి ఎస్ విధానాన్ని అమలు చేయాలని జిల్లా పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు గడ్డం భాస్కర్ అన్నారు. రాష్ట్ర జేఏసీ ఉద్యోగుల సంఘం పిలుపుమేరకు జిల్లా పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం తరఫున జిల్లా కేంద్రంలో జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ డీఎ లను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం అమలు దిశగా ఆలోచించాలన్నారు. ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తినకుండా సమస్యలు పరిష్కరించాలని ముకుమ్మడిగా నినాదాలు చేస్తూ భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రదీప్ కుమార్, పరిషత్ యూనిట్ అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి, జిల్లా పరిషత్ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు, ఇతర కార్యవర్గ సభ్యులు, మహిళా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 

CPS should be abolished and OPS policy should be implemented.