Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 September 2025, 5:00 pm Posted by : ramakrishna

సుందరయ్య కాలనీని సందర్శించిన సీపీఎం నాయకులు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్థానిక సమస్యలపై సర్వేలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సుందరయ్య కాలనీని బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ  గత 17 సంవత్సరాలుగా నివసిస్తున్న ఎన్నికల సమయంలో ఓటింగ్ కోసం వచ్చిన ప్రతినిధులు ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఇళ్ల పట్టాలు ఇస్తామని చెబుతూ మభ్యపెడుతూ ఓటింగ్ ఉపయోగించుకుంటున్నారు తప్ప సమస్యలు పరిష్కారం కావట్లేదు అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారని అన్నారు. సుందరయ్య కాలనీ సమస్యలను పరిష్కారం ప్రభుత్వ అధికారుల పరిష్కరించకపోతే రేపు రానున్న రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానికులు హైమద్, భీమశంకర్, జలేక   నరసమ్మ, రహిమ, వరలక్ష్మి, గంగాధర్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

CPM leaders visited Sundarayya Colony