ప్రజా సమస్యలపై సీపీఎం అధ్యయన బృందాల ఏర్పాటు

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విద్య, వైద్య రంగాలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అధ్యయనం చేసేందుకు సీపీఎం జిల్లా కమిటీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కార్యదర్శి ఎ. రమేష్ బాబు తెలిపారు. ఆదివారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి అక్కడి పరిస్థితులపై సమగ్ర సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్లు, యూనిఫాంలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు....