Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 April 2026, 9:28 pm Posted by : ramakrishna

నూర్జహాన్ కు నివాళులర్పించిన సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు

 

. . . నూర్జహాన్ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నూర్జహాన్ జిల్లా కార్మిక రంగంలో అనేక సేవలందించిందని, ప్రజా సమస్యల పైన నిత్యం ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తి అని, ఆమె మరణం ప్రజా ఉద్యమాలకు తీరనిలోటు అని సీపీఐ నాయకులు అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా నాయకురాలు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నూర్జహాన్ శనివారం అనారోగ్యంతో మరణించారు. నాందేవ్ వాడలో ఉన్న సిఐటియు కార్యాలయంలో నూర్జహాన్ పార్దివ దేహానికి సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా, ఏఐకెఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య, తే.యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పిట్ల సరిత, ఇఫ్టు నగర కార్యదర్శి శివకుమార్, పీడీఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, ఐఎఫ్ టీయు నాయకులు మోహన్, పీడీఎస్ యు నాయకులు పవన్ కుమార్ ఉన్నారు.

 

CPI(ML) New Democracy leaders pay tribute to Noor Jahan