సీపీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

బోధన్, బతుకమ్మ : భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకురాలు స్వరూప రాణి జెండా ఎగురవేసి మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఆవిర్భవించిందని తెలిపారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడి ఎందరో త్యాగాలు చేశారని పేర్కొన్నారు. నిజాం కు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ రైతాంగం తరఫున పోరాటం చేసి సువర్ణ అక్షరాలతో చరిత్రలో నిలిచిందని...