Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 June 2025, 3:55 pm Posted by : ramakrishna

సిపిఐ మహాసభను విజయవంతం చేయాలి

  • సిపిఐ  మండల కార్యదర్శి విఠల్ గౌడ్

 

బతుకమ్మ, కోటగిరి : సిపిఐ మండల మహాసభను విజయవంతం చేయాలనీ సిపిఐ  మండల కార్యదర్శి విఠల్ గౌడ్ పిలుపునిచ్చారు.  కోటగిరి మండల కేంద్రంలో  ఎంపీడీఓ ఆవరణంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గత కొన్ని రోజుల నుంచి గ్రామాలలో గ్రామ శాఖ సమావేశాలు నిర్వహించడం జరిగిందని గ్రామాలలో ప్రజా సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగిందని సిపిఐ పార్టీ పేద ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీ అని అన్నారు. ఈనెల  10వ తేదీన కోటగిరి మండల కేంద్రంలో శ్రీ నలంద స్కూల్లో మండల మహాసభను నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి గ్రామాలలో ఉన్న శాఖ కార్యదర్శిలు శాఖ సభ్యులు హాజరవుతారని కోటగిరి గ్రామంలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐ పార్టీ ఉందని రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడానికి మాసభలలో తీర్మానాలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నల్లగంగాధర్ చెరుకు, తోట సాయిలు, కే గోపి, ఎండి అన్వర్, తదితరులు పాల్గొన్నారు.