సీపీ వర్సెస్ ఎమ్మెల్యే

 రైతు రుణమాఫీ ట్రాక్టర్ల ర్యాలీకి పోలీసుల అనుమతి నిరాకరణ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన వ్యవహరం బతుకమ్మ, నిజామాబాద్ నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకే పోలీసు కమిషనర్ షాక్ ఇచ్చారు. జిల్లాలో పోలీసు యాక్టు 30 అమలు అవుతుందని, దానికి విరుద్దంగా ఎలాంటి ర్యాలీలు, నిరసనలకు అనుమతులు లేవని ఇప్పటికే పలు దఫాలుగా ప్రకటనలు జారీ చేశారు నిజామాబాద్ పోలీసు కమిషనర్. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ పథకం ఈ నెల 15న సాకారమైంది....