Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 February 2026, 6:05 pm Posted by : ramakrishna

కానిస్టేబుల్ ను పరామర్శించిన సీపీ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

విధి నిర్వహణలో భాగంగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన కానిస్టేబుల్ ని నగర పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం పరామర్శించారు. జిల్లా పాస్ పోర్ట్ కార్యాలయం లో విధులు నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్ 1921, ఎన్. గంగా ప్రసాద్ ఆదివారం ప్రమాదానికి గురి కాగా వెంటనే జిల్లా మెడికవర్ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించారు. కానిస్టేబుల్ ని పరామర్శంచిన అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను సీపీ అడిగి తెలుసుకున్నారు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి ధైర్యం చెప్పారు. చికిత్సకు సంబంధించి పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఆయన భరోసా ఇచ్చారు.  ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ ప్రశాంత్ (పలమనాలజిస్ట్), డాక్టర్ మణిదీప్ రెడ్డి (ఆర్తోపెడిక్ సర్జన్), డాక్టర్ వను (అనస్తిషియా), జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.