రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సోమవారం పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయం (హెడ్‌క్వార్టర్స్)తో పాటు అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వేడుకల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పరిశీలించిన కమిషనర్ వేదిక నిర్మాణం, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు తదితర అంశాలపై అధికారులకు...