నీట్ పరీక్ష కేంద్రాలలో బందొబస్త్ ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా లో నిర్వహించబడుతున్న నీట్ 2026 పరీక్షల సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పర్యవేక్షించారు. ఆదివారం గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజీ (ఆటోనోమస్) హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్ బ్లాక్ లోని పరీక్ష కేంద్రాన్ని ఆయన క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు విస్తృతమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ...