Batukammanews
Newspaper Banner
Date of Publish : 31 March 2025, 2:18 pm Posted by : ramakrishna

బందోబస్తును పర్యవేక్షించిన సీపీ

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: రంజాన్ సందర్భంగా నగరంలోని ఈద్గాలు, మసీద్ ల వద్ద బందోబస్తును సీపీ పోతరాజు సాయిచైతన్య పర్యవేక్షించారు. ఐదో టౌన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా, వన్ టౌన్ పరిధిలోని కచ్చియా మసీద్ తోపాటు బోధన్ లోని ఈద్గా వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. నిజామాబాద్ నగరంలోని శంభునిగుడి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సీపీ వెంట అదనపు పోలీస్ కమిషనర్ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్, బోధన్, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, శ్రీనివాస్, ట్రాఫిక్ ఏసీపీ నారాయణ, సీఐలు, ఎస్సై లు తదితరులున్నారు.

CP supervised the security arrangements