పోలీస్ స్టేషన్లలో సీపీ సుడిగాలి పర్యటన

మూడు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని టౌన్ 3 , టౌన్ 4 , నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ల  పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.   5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ...