Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2025, 7:48 pm Posted by : ramakrishna

పోలీస్ స్టేషన్లలో సీపీ సుడిగాలి పర్యటన

  • మూడు పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సీపీ

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని టౌన్ 3 , టౌన్ 4 , నిజామాబాదు రూరల్ పోలీస్ స్టేషన్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శుక్రవారం తనిఖీ చేశారు.  ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. రిసిప్షన్ సెంటర్ల  పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.   5ఎస్ విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు.  ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున,

CP Sudigali's whirlwind tour of police stations

తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు. గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అవుతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. సైబర్ మోసగాళ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.   ఈ సందర్బంగా ట్రైయిన  ఐపీఎస్ సాయి కిరణ్ పత్తిపాక, నిజామాబాదు

CP Sudigali's whirlwind tour of police stations

ఏసీపీ ఎల్. రాజా వెంకట్ రెడ్డి , టౌన్ సీఐ శ్రీనివాస్ రాజ్, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్, టౌన్ 3 ఎస్ఐ (2) గంగాధర్, టౌన్ 4 ఎస్ఐ శ్రీకాంత్, నిజామాబాదు రూరల్ ఎస్ఐ ఎండీ. ఆరిఫ్, పోలీస్ స్టేషన్ల సిబ్బంది  పాల్గొన్నారు.

CP Sudigali's whirlwind tour of police stations