పోలీస్ స్టేషన్ ని తనిఖీ చేసిన సీపీ సజ్జనార్

హైదరాబాద్, బతుకమ్మ :  హైదరాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ ని శుక్రవారం హైదరాబాద్ సీపీ సజ్జనార్  ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా    ఫిర్యాదుదారులతో నేరుగా సజ్జనార్ మాట్లాడారు. పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రేట్ తో పాటు ఇతర వివరాలను అడ్మిన్ అధికారితో పాటు ఇతర పోలీసు సిబ్బందిని అడిగి సజ్జనార్ తెలుసుకున్నారు. దాదాపు 45 నిమిషాల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉన్న సజ్జనార్ ఉన్నారు.