తప్పిపోయిన చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీపీ సాయిచైతన్య

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ మాతా శిశు సంరక్షణ కేంద్రం నుంచి తప్పిపోయిన మూడేళ్ల బాలుడు వేదాన్ష్ కుటుంబాన్ని పోలీసు కమిషనర్ సాయిచైతన్య  శనివారం రాత్రి పరామర్శించారు. బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన వేదాన్షు అనే చిన్నారి గుర్తుతెలియని మహిళ చేత అపహరణకు గురైన ఘటనపై నిజామాబాద్ పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని  సీపీ తెలిపారు. చిన్నారి కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తండ్రి నరేష్ తో పాటు కుటుంబ...