ఈద్గాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్, బతుకమ్మ : బక్రీద్ పండుగ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకునేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా 5వ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాంతినగర్ ఈద్గా వద్ద పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బందోబస్తు పర్యవేక్షించారు. ఈద్గా పరిసర ప్రాంతాలలో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాలు, భక్తుల రాకపోకలు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను సీపీ క్షుణ్ణంగా పరిశీలించి...