సీసీ కెమెరాలను ప్రారంభించిన సీపీ సాయిచైతన్య
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని 6వ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాలను నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ప్రారంభించారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను శుక్రవారం సీపీ ప్రారంభించి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో అత్యంత సమస్యాత్మక పోలీస్ స్టేషన్ లలో ప్రధానమైన 6వ టౌన్ పరిధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను నియంత్రించేందుకు అవకాశం కలిగిందని సీపీ అన్నారు. పోలీస్ స్టేషన్ ను పరిశీలించి స్థానిక పెద్దలతో సమస్యలపై చర్చించారు....