Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 July 2025, 8:25 pm Posted by : ramakrishna

లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించిన సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు, వాగులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మంగళవారం పర్యవేక్షించారు. సిరికొండ మండలంలో గల కొండూరు, తుంపల్లి గ్రామాలలో వరద ప్రభావితానికి గురయ్యే బ్రిడ్జిలను సందర్శించారు.  సిరికొండ నుండి న్యావనంది మార్గమధ్యలో గల వాగు, దొoడ్ల వాగు నుక్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా పోలీస్ కమీషనర్ మాట్లాడుతు గ్రామ ప్రజలకు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తూ, ప్రజల భద్రతకు సంబంధించి కీలక సూచనలు ఇచ్చారు.   గ్రామ భద్రత దృష్ట్యా  సీసీ కెమెరాల అవసరం, ప్రాముఖ్యత గురించి వివరించి, ప్రతి గ్రామంలో వీటిని ఏర్పాటు చేసుకోవాలని గ్రామ ప్రజలను ప్రోత్సహించారు.  ఈ సందర్భంగా ధర్పల్లి ఇన్స్పెక్టర్ బిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

CP Sai Chaitanya inspected the low-lying areas