నందిపేట పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన సీపీ సాయి చైతన్య
రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశాలు నిజామాబాద్/నందిపేట, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నందిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, రికార్డులు, కేసుల పురోగతిపై వివరాలు తీసుకున్నారు. నందిపేట, డొంకేశ్వర్ మండలాల్లో పోలీసు సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కమిషనర్ సూచించారు. మండలాల్లో ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ షీటర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని ఎస్ హెచ్ వో చిరంజీవిని ఆదేశించారు. ప్రజలకు...