Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 October 2025, 6:42 pm Posted by : ramakrishna

ఏకే47 ఎక్కుపెట్టిన సీపీ సాయిచైతన్య

  • ఆయుధపూజలో కమిషనర్ దంపతులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఎకె 47 ఎక్కుపెట్టి గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. విజయదశమిని పురస్కరించుకుని పోలీసు శాఖ హెడ్ క్వార్టర్స్ లో ఆయుదపూజ నిర్వహించింది. సాంప్రదాయంగా వస్తున్న ఆనవాయితీని పురస్కరించుకుని గురువారం నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లలో ఆయుద పూజ, వాహనాలకు పూజా, బి.డి టీమ్ సామాగ్రికి పోలీసు కమిషనర్ సాయిచైతన్య  నిర్వహించారు. ఆయుద పూజ అనంతరం ఏకె 47 ఆయుదంతో 5 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపారు. అనంతరం సీపీ దసరా పండుగ ప్రజలందరికీ శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (అడ్మిన్) జి. బస్వారెడ్డి, అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) రామచందర్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్స్ శ్రీనివాస్, తిరుపతి, శేఖర్ బాబు, ఎమ్.టి సెక్షన్ పోలీస్ సిబ్బంది, బీ.డీ టీం సిబ్బంది,ఆర్మూడ్ రిజర్వు సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

CP Sai Chaitanya brandishing an AK-47