పోలీస్ ప్రజావాణిలో 39 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 39 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా ఆలకించి, వాటిని చట్టబద్ధంగా, త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడిన పోలీస్ కమిషనర్, కేసుల ప్రస్తుత స్థితిని...