పోలీస్ ప్రజావాణి లో 39 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి మొత్తం 39 ఫిర్యాదులను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను స్వయంగా ఆలకించిన కమిషనర్, వాటిని చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును పరిశీలించిన కమిషనర్, సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌ఐలు, సీఐలతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి కేసుల ప్రస్తుత...