పోలీస్ ప్రజావాణిలో 32 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో 32 ఫిర్యాదులను స్వీకరించినట్లు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన వివిధ రకాల ఫిర్యాదులను స్వయంగా విన్న కమిషనర్, వాటిని చట్టబద్ధంగా పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల అర్జీలను...