Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 7:20 pm Posted by : ramakrishna

ప్రజావాణిలో 30 ఫిర్యాదులను స్వీకరించిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి 30 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం వాటి తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్సై, సి.ఐ లకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని తెలుసుకుని పరిష్కారానికి తగిన సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకుంటూ, వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని సీపీ తెలియజేశారు. ప్రజా సమస్యల పై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కారిస్తున్నామని ఆయన అన్నారు.

 

CP receives 30 complaints in Prajavani