పోలీస్ ప్రజావాణిలో 30 ఫిర్యాదులు స్వీకరించిన సీపీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన స్వయంగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మొత్తం 30 ఫిర్యాదులను స్వీకరించిన పోలీస్ కమిషనర్, ప్రతి సమస్యను చట్టపరంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్‌ల ఎస్‌ఐలు, సీఐలకు...