సీపీ పోస్టు వేకెన్సీ @ 100 డేస్
కొత్వాల్ లేకుండా గతి తప్పిన పాలన పోలీసుల ఇష్టారాజ్యం జిల్లాలో పోలీసు అధికారులపై కేసుల నమోదు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సింగనవారే బదిలీ అయి అప్పుడే 100 రోజులు గడిచాయి. దాదాపు మూడు నెలలుగా ఇంచార్జి సీపీ పాలనలో నిజామాబాద్ కమిషనరేట్ కొనసాగుతుంది. రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల తర్వాత అతిపెద్ద కమిషనరేట్ గా నిజామాబాద్ కమిషనరేట్ కు పేరుంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్లతో పాటు సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్,...