Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 February 2026, 10:57 am Posted by : ramakrishna

ఎన్నికల కౌంటింగ్ భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన సీపీ

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : 

 

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ , బోధన్ , ఆర్మూర్ , భీంగల్ పరిధిలో జరుగుతున్న కౌంటింగ్ భద్రత ఏర్పాట్ల ప్రక్రియను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శుక్రవారం పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 163 బి.ఎన్.ఎస్.ఎస్ (గతంలో సెక్షన్ 144 కింద ) నిషేధ ఆజ్ఞలు విధించడం జరిగిందని దీని ప్రకారము ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమి కూడవద్దని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడు అంచల బందోబస్తు ఏర్పాటు చేశామని , సాయుధ బలగాలు, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ నిరంతరం పహార కాస్తున్నాయని అన్నారు.

CP oversees security arrangements for election counting

కౌంటింగ్ హాలు లోకి కేవలం అభ్యర్థులు వారి ఎన్నికల ఏజెంట్లు కౌంటింగ్ ఏజెంట్లు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బందిని మాత్రమే అనుమతించాలని అందరూ తప్పనిసరిగా జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసిన గుర్తింపు కార్డులు కలిగి ఉండాలని , ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమ నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలని, అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసులకు సహకరించి శాంతియుతంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన చూడాలని తెలియజేశారు.సీపీ వెంట నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ , ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీశైలం , నిజామాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస్ రాజ్ రూరల్ సిఐలు సురేష్ కుమార్ , శ్రీనివాస్, వినోద్, ఎస్.హెచ్.ఓ లు, ఎస్. ఐ లు ఎన్నికల పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.

CP oversees security arrangements for election counting