ఎన్ హెచ్63 రహదారిలో బ్లాక్ స్పాట్లను పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్ హెచ్63 రహదారిలో గల బ్లాక్ స్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మొత్తం 26 బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ మధ్య కాలంలో నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో, అట్టి రోడ్డు ప్రమాదల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలన సూచించారు. నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఎన్ హెచ్63 కమర్ పల్లి నుండి బోధన్ వరకు...