Batukammanews
Newspaper Banner
Date of Publish : 12 August 2025, 4:58 pm Posted by : ramakrishna

ఎన్ హెచ్63 రహదారిలో బ్లాక్ స్పాట్లను పర్యవేక్షించిన సీపీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎన్ హెచ్63 రహదారిలో గల బ్లాక్ స్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మొత్తం 26 బ్లాక్ స్పాట్లను గుర్తించి సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ మధ్య కాలంలో నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో, అట్టి రోడ్డు ప్రమాదల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలన సూచించారు.  నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని ఎన్ హెచ్63 కమర్ పల్లి నుండి బోధన్ వరకు గల 77 కిలోమీటర్లు పరిధిలో గల రోడ్డు ను పోలీస్ శాఖ, ఆర్ అండ్ బీ శాఖ, ఎన్ఐసీ శాఖ, పంచాయతీ శాఖ, మోటార్ వెహికిల్ శాఖ , 108 సర్వీస్ శాఖ మొదలగు శాఖ ల అధికారులతో సమన్వయంతో క్షుణ్ణంగా పర్యవేక్షణ చేశారు. ప్రజల ప్రాణ రక్షణ కోసం ట్రాఫిక్ నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ పెర్కిట్ ఈఈ ఎ.మలారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ మంచిర్యాల అజయ్, ఆర్టీఏ అధికారి ఉమా మహేశ్వర్ రావ్,  ఆర్ అండ్ బీ ఏఈ సతీష్, జిల్లా పంచాయతీ రాజ్ కార్యాలయం సిబ్బంది రామకృష్ణ, ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ , ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, ఐ ఆర్ఏడీ  మేనేజర్ వర్షా, 108 ఈఎంఆర్ఐ  సర్వీసెస్ రామలింగేశ్వర రెడ్డి, అర్ముర్ మున్సిపల్ కమీషనర్ రాజు,  సీఐలు, ఎస్ఐ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

CP monitors black spots on NH63