Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 January 2026, 3:39 pm Posted by : ramakrishna

జిల్లాలో అరైవ్ అలైవ్  అవగాహన కార్యక్రమo ప్రారంభించిన సీపీ

. . .ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం ప్రాణాలను కాపాడుకుందాం

 

. . .జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో పోలీస్ కమీషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

 

నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకుందామని  పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రసంగించారు. 2020 – 21 సంవత్సరంలో కోవిడ్ వల్ల మరణించిన వారి కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ లో మాస్కులు ధరించి సురక్షితంగా ఉన్నారని కానీ వాహనాలు నడిపే సమయంలో సీటు బెల్టు , హెల్మెట్లు పెట్టుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించి అనేకమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారన్నారు.

రెండేళ్ల కరోనా సమయంలో 200 మంది కరోనాతో చనిపోతే , 2025 వ సంవత్సరంలో 250 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్నారు. కుటుంబ భద్రతకు భరోసాను కల్పిస్తూ సురక్షితమైన డ్రైవింగ్ చేయాలని సూచించారు. గత సంవత్సరం ఫిన్లాండ్ అనే దేశంలో ఒక్క రోడ్డు ప్రమాదం కూడా జరగలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రమాదాల నియంత్రణకు రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ అరైవ్ అలైవ్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారని దీన్ని ఒక తపస్సు లాగా ముందుకు తీసుకెళ్లాలని అయన సూచించారు. డ్రైవింగ్ లో మూడు సూత్రాలను తప్పకుండా పాటించాలని పోలీస్ కమీషనర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ, ముఖ్యంగా యువత అతివేగంతో వెళ్లకుండా నెమ్మదిగా వెళ్లాలని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు తెలియజేసారు.

CP launches Arrive Alive awareness campaign in the district

ఈ సందర్బంగా అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత హుషాముద్దిన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో కుటుంబంలో ఒకరిని కోల్పోయామని, విష్ణు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు, న్యూరో సర్జన్ డాక్టర్ రమనేశ్వర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ వాడకుండా క్షేమంగా వాహనాలు నడపుతూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. అనంతరం రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించి , టీ షర్ట్స్, ట్రాఫిక్ నిబంధనలతో కూడినటువంటి స్లోగానికి సంబంధించినటువంటి ప్లే కార్డ్స్ ప్రారంభించారు. విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సౌజన్యంతో వాహనదారులకు 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కార్యక్రమం లో అదనపు డీసీపీ (అడ్మిన్)  బస్వారెడ్డి , జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి  ఉమామహేశ్వర్, ఆర్టీసీ డిపో మేనేజర్ బి. ఎస్ ఆనంద్, ఐఎంఏ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ. విశాల్ , న్యూరో సర్జన్ డాక్టర్ రమనేశ్వర్, నిజామాబాద్ ఏసిపిజా రా జా వెంకటరెడ్డి , ట్రాఫిక్ ఏసిపి శ్రీ మస్తాన్ అలీ ,  డిగ్గి వర్కర్స్ , అంబులెన్స్ అసోసియేషన్ , ఆటో అసోసియేషన్స్ , క్యాప్ డ్రైవర్స్ అసోసియేషన్స్, వ్యాపార సముదాయాల యాజమానులు తదితరులు పాల్గొన్నారు.

CP launches Arrive Alive awareness campaign in the district