ఊర పండుగ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నగరంలో ఆదివారం ఘనంగా నిర్వహిస్తున్న ఊర పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతిభద్రతలు సక్రమంగా కొనసాగేందుకు చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా పరిశీలించారు. పండుగ జరిగే ప్రధాన ప్రాంతాలు, ఊరేగింపు మార్గాలు, రద్దీ కూడళ్లు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాలు, పార్కింగ్ స్థలాలను కమిషనర్ క్షేత్రస్థాయిలో సందర్శించి పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. భక్తుల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, సున్నిత...