త్రివేణి సంగమం వద్ద భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కందకుర్తి వద్ద గల త్రివేణి సంగమం నది పరివాహక ప్రదేశాల వద్ద భద్రత ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బుధవారం పర్యవేక్షించారు. వర్షా కాలం భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాదు, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలని నీటి పరివాహక ప్రాంతాల్లో నదులు, కాలువల ప్రాంతాలలో ప్రజలు వారి యొక్క మ్రొక్కులు తీర్చుకోవడానికి , స్నానాలు చేయడానికి వస్తుంటారని అన్నారు. ప్రజల భద్రత నేపథ్యంలో అట్టి స్థలాలలో గట్టి...