గణేష్ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గణేష్ ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద భద్రతా ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయిచైతన్య క్షుణ్ణంగా పరిశీలించారు. మంగళవారం నిజామాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రతా చర్యలు చేపడుతోంది.ఈ సందర్భంగా గణేష్ మండపాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది వివరాలు,బందోబస్తు పాయింట్లు, సిబ్బంది అప్రమత్తత తదితర అంశాలను పరిశీలించారు. అలాగే ప్రతి మండపం వద్ద నిర్వహిస్తున్న పాయింట్ బుక్‌లను క్షుణ్ణంగా...