Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 7:03 pm Posted by : ramakrishna

సాటాపూర్ పశువుల అంగడిని తనిఖీ చేసిన సీపీ

 

. . . ఆరోగ్య ధృవపత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలి

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, శాంతి భద్రతలు పరిరక్షించేందుకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సాటాపూర్ పశువుల సంత ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పశువుల క్రయ విక్రయాల గురించి సాతాపూర్ గ్రామ పంచాయతీ సిబ్బంది ని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నగర పరిధిలో ఏర్పాటు చేసిన వెటర్నరీ డాక్టర్ల చెకింగ్ పాయింట్‌ను కూడా తనిఖీ చేశారు. వెటర్నరీ ఆఫీసర్ లు ఇస్తున్న సర్టిఫికేట్ ల గురించి అడిగి తెలుసుకున్నారు. పశువుల వాహనాలు తనఖీ చేసి వాహనాలలో తరలిస్తున్న వాటిని కూడా చెక్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పశువుల రవాణా, విక్రయాలు, బలి కోసం తీసుకువస్తున్న జంతువులకు సంబంధించిన ఆరోగ్య ప్రమాణాలు సక్రమంగా పాటిస్తున్నారా అనే అంశాలపై సమగ్రంగా పరిశీలించారు. వెటర్నరీ అధికారులు ప్రతి జంతువుకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య ధృవపత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. అలాగే అక్రమ రవాణా, అనారోగ్య పశువుల విక్రయాలు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 

CP inspects Satapur cattle market

 

చెకింగ్ పాయింట్ల వద్ద పోలీసులు, వెటర్నరీ సిబ్బంది పరస్పర సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపి శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ చంద్ర మోహన్, జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రోహిత్ రెడ్డి, మండల వెటర్నరీ డా. విఠల్, డా. ప్రమోద్, ఎడపల్లి డా నరేందర్, నవీపేట్ డా. సురేష్ పాల్గొన్నారు.

 

CP inspects Satapur cattle market