Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 December 2025, 2:10 pm Posted by : ramakrishna

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

నిజామాబాద్, బతుకమ్మ :  బోధన్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లు, పోలింగ్ సరళిని గురువారం సీపీ సాయి చైతన్య పరిశీలించారు.  ఎడపల్లి మండలంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి,  ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు , భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఎన్నికలు పూర్తిగా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , అధికారులు నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు.  బోధన్ రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ విజయబాబు, ఎడపల్లి ఎస్సై రమ, భీంగల్ ఎస్సై సందీప్,  అధికారులు ఉన్నారు. 

CP inspects polling stations