. . . సెంటర్ల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాట్లు
నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా లోని మున్సిపల్ కార్పొరేషన్ / మున్సిపల్ ఎన్నికలు 2026 లో భాగంగా బుధవారం నిజామాబాద్ డివిజన్ లోని టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని టీ టీ డీ కళ్యాణ మండపం లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు.ఈ సందర్భంగా సీపీ నామినేషన్ల స్వీకరణ కేంద్రంను పరిశీలించి , నామినేషన్ ప్రక్రియను గురించి తెలుసుకొని , పోలీస్ సిబ్బంది కి నామినేషన్ సెంటర్ దగ్గరలో 100 మీ.ల లోపు నిషేధిత ఉత్తర్వులు అమలులో ఉంటాయని , అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళిని పాటించాలని , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సీపీ వెంట నిజామాబాదు ఎ.సి.పి బి. ప్రకాష్ , టౌన్ 4 ఎస్.హెచ్.ఓ సతీష్ కుమార్, ఆర్.ఓ వెంకటేష్ , ఏ.ఆర్.ఓ రమేష్ గౌడ్, వారి సిబ్బంది పాల్గొన్నారు.
