కందకుర్తి గోదావరి బ్రిడ్జి, పుష్కర ఘాట్లను పర్యవేక్షించిన సీపీ
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరదలు వస్తున్న సందర్భంగా బోధన్ డివిజన్ పరిధిలో గల రెంజల్ మండలం లోని కందకుర్తి గోదావరి బ్రిడ్జి, పుష్కర ఘాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సోమవారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రానున్న రెండు, మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు కూడా నీటి ప్రవాహం...