ఊరపండుగ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఇందూరు నగర ఊరపండుగను పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న శోభాయాత్ర ఏర్పాట్లను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, భక్తులకు సౌకర్యాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా నగరంలో ఊరపండుగ సందర్భంగా ప్రతిష్ఠించనున్న అమ్మవారి విగ్రహాల తయారీ కేంద్రాలను, సంబంధిత రహదారులను కమిషనర్ సందర్శించారు. కళాకారులతో మాట్లాడి విగ్రహాల తయారీ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం శోభాయాత్ర నిర్వహించే మార్గాన్ని పరిశీలిస్తూ భద్రతా చర్యలు, ట్రాఫిక్...