ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈ నెల 6న డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారు లోని కేశపురం గ్రామం పరిధి లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభను పురస్కరించుకుని, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం సభా ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సభ నిర్వహించనున్న స్థలం, ప్రముఖులు కూర్చునే డి-రింగ్ భద్రతా ప్రాంతం, ప్రజలు కూర్చునే విభాగాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు,...