ప్రమోద్ కుమార్ స్మారక ఫుట్ బాల్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ
నిజామాబాద్ , బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ప్రమోద్ కుమార్ జ్ఞాపకార్ధం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ యువతను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరై ప్రమోద్ కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా సీపీ సాయిచైతన్య మాట్లాడుతూ సంఘవిద్రోహ శక్తులతో పోరాడుతూ వీరమరణం పొందిన మన సహచరుడు కానిస్టేబుల్ ప్రమోద్ స్మృతికి...