హైదరాబాద్, బతుకమ్మ : ఐసీసీసీ నుంచి జూబ్లీహిల్స్ పోలింగ్ సరళిని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం 900 సీసీటీవీ కెమెరాల ద్వారా పోలింగ్ స్టేషన్లను రియల్ టైమ్ మానిటరింగ్ చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఓటింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.