Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 May 2026, 9:21 pm Posted by : ramakrishna

ట్రాఫిక్ సిబ్బందికి కూల్ వాటర్ ప్లాస్క్ లు పంపిణి చేసిన సీపీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఎండాకాలం తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, విధుల్లో ఉన్న ట్రాఫిక్ సిబ్బందికి కూల్ వాటర్ ప్లాస్క్ లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులు పంపిణీ చేశారు. నిజామాబాద్ వాసవి జనత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కమీషనర్ కార్యాలయం లో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతు ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతల మధ్య విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఆరోగ్యం మా ప్రాధాన్యతని, ప్రజల భద్రత కోసం వారు నిరంతరం కష్టపడుతున్నారన్నారు.

 

CP distributes cool water flasks to traffic personnel

 

ఇలాంటి పరిస్థితుల్లో తగినంత నీరు తాగడం, ఓఆర్ఎస్ తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాసవి జనత ఫౌండేషన్ వారు ముందుకు వచ్చి ఈ సామగ్రిని అందించడం అభినందనీయమని, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజంలో సహకార భావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎ.సి.పి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సి.ఐ ప్రసాద్, రిజర్వ్ ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ వినోద్, వాసవి జనత ఫౌండేషన్ సభ్యులు సాయి ప్రసాద్, మేటూరి లక్ష్మణ గుప్తా, గోలి ప్రసాద్, నితిన్ నంగనూరి, కళ్యాణి మోటూరి, బచ్చు సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

CP distributes cool water flasks to traffic personnel