నిజామాబాద్, బతుకమ్మ : జిల్లాలోని జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న జే. గోవిందరావు, అనే హెడ్ కానిస్టేబుల్ కుమారుడు జే. సాయి చైతన్య యూపీఎస్సీలో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా శుక్రవారం నిజామాబాదు పోలీస్ క్యాంప్ కార్యాలయంలో జే.గోవింద్ రావు కుమారుడు జే. సాయి చైతన్యను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిచ్ పల్లి సీఐ మల్లేష్ , రిజర్వ్ ఇన్ స్పెక్టర్లు శ్రీనివాస్ ( అడ్మిన్ ), తిరుపతి ( వెల్ఫేర్ ) పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్, షకిల్ పాషా, తదితరులు పాల్గొన్నారు.