నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మంగళవారం అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వా రెడ్డి బదిలీపై వెళ్తున్న సందర్భంగా నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు బస్వా రెడ్డి సేవలను ప్రశంసిస్తూ, పోలీస్ విభాగంలో ఆయన చేసిన కృషి, కట్టుదిట్టమైన పరిపాలన, ప్రజల భద్రత కోసం తీసుకున్న చర్యలను గుర్తుచేశారు. భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీస్ అధికారులు, సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.