Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 July 2025, 9:12 pm Posted by : ramakrishna

ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద సిపీ ఆకస్మిక పరిశీలన

 

…రోడ్డు ప్రమాదాల నివారణపై అప్రమత్తంగా ఉండాలని సూచన

ఇందల్వాయి,బతుకమ్మ

ఇందల్వాయి టోల్ లజ్జ వద్ద నిజామాబాద్ జిల్లా సిపి సాయి చైతన్య రోడ్డు ప్రమాదాల నివారణ పై ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రోడ్డు భద్రత లో భాగంగ రోడ్డు ప్రమాదాల నివారణకు బార్డర్ టోల్ ప్లాజా అయిన ఇందల్వాయి కు వచ్చి బార్డర్ టోల్ ప్లాజా కావడంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని తగు సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇందల్వాయి మండలంలో ని ఎక్కువగా ప్రమాదాలు జరిగే  ప్రదేశాలు బ్లాక్ స్పార్ట్స్ ను  సందర్శించి అక్కడ రోడ్డు ప్రమాదాలకు తీసుకోవలసిన జాగ్రత్తలను, సూచనలను ఇచ్చారు.గ్రామాల్లో ప్రజలకు రోడ్డు భద్రత, ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులు హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల నివారణ ప్రజలకు వివరించమని ఆదేశించారు ప్రమాదాలపై అనునిత్యంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు  జారీ చేశారు.. భారీ వర్షాల కారనంగా రోడ్స్ బ్లాక్ అయ్యే ప్రదేశాల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో డిచ్పల్లి సిఐ,వినోద్,ఇందల్వాయి ఎస్సై సందీప్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

CP conducts surprise inspection at Indalwai Toll Plaza