Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2025, 11:21 am Posted by : ramakrishna

అర్ధరాత్రి వేళ తనిఖీలు నిర్వహించిన సీపీ

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో సోమవారం అర్ధరాత్రి వేళ సీపీ సాయి చైతన్య పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా  రైల్వే స్టేషన్ , ఆర్టీసీ బస్టాండ్ , గాంధీచౌక్ , నెహ్రూ పార్క్, శివాజీ నగర్ , కంఠేశ్వర్, దేవీ రోడ్డు , ఫ్లై ఓవర్ బ్రిడ్జి తదితర ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి పోలీసులకు పలు సూచనలు చేశారు. నగరంలో ఎలాంటి నేరాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఈతనిఖీలు చేపట్టినట్లు పేర్కొన్నారు. కారణం లేకుండా బయట తిరుగుతున్న వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. మరోసారి ఈవిధంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో పోలీసు సిబ్బంది ఉన్నారు.


CP conducted inspections at midnight


CP conducted inspections at midnight