Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 6:29 pm Posted by : ramakrishna

ఇందల్వాయి చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సిపీ చైతన్య

 

 ఇందల్వాయి, బతుకమ్మ :

గ్రామ పంచాయితీ ఎన్నికల నేపద్యంలో ఇందల్వాయి చెక్ పోస్ట్ ను నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపద్యంలో గురువారం సిపి. సాయి చైతన్య ఇంటర్ డిస్ట్రిక్ బార్డర్ చెక్ పోస్ట్ ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన  చెక్ పోస్ట్ లో సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికల సమయంలో అక్రమ రవాణా, నగదు, మద్యం అనుమానస్పద వ్యక్తులను  తనిఖీలు కఠినంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా, భయభ్రాంతి  లేకుండా ఓటు హక్కును వినియోగించూ కునేలా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్.ఎస్ టీమ్ ఇంచార్జీ సాయి కుమార్, రవీంధర్ సిబ్బంది పాల్గొన్నారు.

 

CP Chaitanya inspects Indalwai check post